ఆ విషయంలో బాధపడని రోజంటూ లేదు.. కంటతడి పెడుతున్న తల్లి

by GSrikanth |   ( Updated:2022-05-04 08:37:55.0  )
ఆ విషయంలో బాధపడని రోజంటూ లేదు.. కంటతడి పెడుతున్న తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రుల ఆలోచన ఎప్పుడూ పిల్లలమీదనే ఉంటుంది. వాళ్లు చేయాలనుకున్నవి, జీవితంలో సాధించాలనుకున్నవి పిల్లలచేత చేయిస్తుంటారు. అచ్చం ఇలాగే ఓ తల్లి తాను సాధించలేనిది పిల్లల చేత సాధించేలా ప్రయత్నం చేద్దామనుకున్నది. కానీ, ఇంతలో ఆ బిడ్డ జీవితానికి పెద్ద కష్టం వచ్చి పడింది. చిన్న వయసులోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆ తల్లి కంటనీరు పెట్టిన విధానం అందరినీ కలచివేస్తోంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలో నివాసముంటున్న దంపతులకు కార్తీక అనే పదకొండేళ్ల కూతురు ఉంది. రోజూ తలనొప్పి ఉందని చెబుతుంటే, తలనొప్పేగా తగ్గిపోతుందిలే అని విజయవాడలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కార్తీకను పరీక్షించిన వైద్యులు, ఆ వయస్సు పిల్లల్లో వచ్చే అరుదైన మెడుల్లాబ్లాస్టోమా అనే బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధి వచ్చినట్లు చెప్పారు. దీంతో తల నొప్పితో విలవిలాడుతున్న పాప బాధను చూడలేక ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టి వైద్యం చేయించారు. అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు పూర్తిగా కోలుకోవాలంటే ఆపరేషన్ చేయాలని, దానికి ఆరు లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పటికే ఉన్నదంతా అమ్మి ఖర్చు చేసిన ఆ తల్లిందండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఆర్థిక పరిస్థితి బిడ్డకు శాపంగా మారినందుకు బాధపడని రోజంటూ లేదని వాపోయారు. మా బిడ్డ ఆపరేషన్‌కు సాయం చేయాలని చేతులు చాచి వేడుకుంటున్నారు.




Advertisement

Next Story

Most Viewed