జవాన్‌ని కాల్చి చంపిన మావోయిస్టులు

by Vinod kumar |
జవాన్‌ని కాల్చి చంపిన మావోయిస్టులు
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఓ జవాను మావోయిస్టులు కాల్చిచంపారు. ఛతీస్ గడ్ రాష్ట్రం కంకేర్‌లో నగర జవాన్ గా పనిచేస్తున్న సంజయ్ కుంజమ్‌ను మావోయిస్టులు గుంజీర్ గ్రామం ముర్గా బజార్‌లో సోమవారం సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో కాల్చి హత్య చేసినట్లు సమాచారం. అమబెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్పీ సలభ్ కుమార్ సిన్హా ఈ విషయాన్ని ధృవీకరించారు.



Advertisement

Next Story