ఉక్రెయిన్ ఆర్మీలో 20 వేల మంది విదేశీ వాలంటీర్లు

by Harish |
ఉక్రెయిన్ ఆర్మీలో 20 వేల మంది విదేశీ వాలంటీర్లు
X

కీవ్ : రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సుమారు 20 వేల మంది విదేశీ వాలంటీర్లు ఉక్రెయిన్ దళాల్లో చేరినట్టు 'ది కైవ్ ఇండిపెండెంట్' వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపు మేరకు వివిధ దేశాలకు చెందిన పౌరులు స్వచ్ఛందంగా అంతర్జాతీయ ఆర్మీ దళంలో భాగస్వాములవుతున్నారు. అయితే, వీరికోసం అధ్యక్షుడు జెలెన్ స్కీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. విదేశీ వాలంటీర్లకు కావాలంటే ఉక్రెయిన్ పౌరసత్వం ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని ఆ దేశ మొదటి డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ యెవెన్ యెనిన్ ఉటంకించారు. ఇదిలా ఉండగా, విదేశీ వాలంటీర్లు సైన్యంలో అమెరికా పౌరులు 3వేల మంది ఉండగా, భారత్‌కు చెందిన ఒకరు, ఇతర దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు.

Advertisement

Next Story