- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు రిస్క్ తీసుకోవడం ఇష్టం.. ప్రశంసలు కురిపించిన హీరో
దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ తెలుగు మొదటి సినిమానే స్టార్ ఎన్టీఆర్(NTR) సరసన ‘దేవర’ నటించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) RC16 లోనూ ఆఫర్ అందుకుంది. ఈ క్రమంలో.. తాజాగా, జాన్వీ కపూర్‌పై ఆమె సోదరుడు హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ప్రశంసలు కురిపించారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘నాకు జాన్వీ, ఖుషీ ఇద్దరిపైనా చాలా ప్రేమ ఉంది. కానీ ఇద్దరిలో జాన్వీతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఆమె ఏ విషయంలోనైనా నిజాయితీగా ఉండటంతో పాటు ప్రశంసలు, విమర్శలను ఓకేలా తీసుకుంటుంది. ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎంతో కష్టపడుతుంది.
వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కొత్త కథలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తుంటుంది. జాన్వీకి రిస్క్ తీసుకోవడం ఇష్టం. ప్రతి నిర్ణయానికి నేను మద్దతు ఇస్తాను. ఎప్పుడూ అండగా ఉంటా. మేమిద్దరం కలిసినప్పుడు ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటాం. తినే ఆహారం కానుంచి చేయనున్న ప్రాజెక్టు వివరాల వరకూ మాట్లాడుకుంటాం. ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.