Guppedantha Manasu: ఎంగేజ్మెంట్‌తో షాక్ ఇచ్చిన ‘గుప్పెడంత మనసు’ నటుడు.. నెట్టింట ఫొటోలు వైరల్

by Hamsa |
Guppedantha Manasu: ఎంగేజ్మెంట్‌తో షాక్ ఇచ్చిన ‘గుప్పెడంత మనసు’ నటుడు.. నెట్టింట ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: స్టార్ నటుడు సాయి కిరణ్(Sai Kiran) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ‘నువ్వే కావాలి’(Nuvve Kavali ) సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘ప్రేమించు’(Preminchu) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కానీ హీరోగా రాణించలేకపోయాడు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు.

ఇక బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన సాయి కిరణ్ కోయిలమ్మ, పడమటి సంధ్యారాగం(Padamati Sandhya Ragam) వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు.మరీ ముఖ్యంగా ‘గుప్పెడంత మనసు’(Guppedantha Manasu) సీరియల్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇందులో హీరో రిషి(Rishi)కి తండ్రిగా నటించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తున్నాడు.

తాజాగా, సాయి కిరణ్ ఎంగే‌జ్‌మెంట్(Engagement) చేసుకుని అభిమానులకు షాకిచ్చాడు. కోయిలమ్మ సీరియల్‌లో నటించిన స్రవంతి(sravanthi)తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ కూడా పెట్టాడు. అంతేకాకుండా ఎంగేజ్‌మెంట్‌(Engagement)కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశాడు. దీంతో అవి చూసిన కొందరు అస్సలు ఊహించలేదు షాక్ ఇచ్చాడని అంటుంటే.. మరికొందరు మాత్రం కంగ్రాట్స్ చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed