- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్ టైటాన్స్ గర్జించేనా.. తొలిసారి ఐపీఎల్‌లో గ్రాండ్ ఎంట్రీ
అహ్మదాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 సీజన్-15లో గుజరాత్ టైటాన్స్ జట్టు తొలిసారిగా సందడి చేయనుంది. అహ్మదాబాద్ బేస్డ్‌గా ఏర్పాటైన ఈ ఫ్రాంచైజీ 2016-17లో వచ్చిన గుజరాత్ లయన్స్ జట్టు స్థానాన్ని భర్తీ చేస్తూ ఐపీఎల్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ వేలంలో ఈ ఫ్రాంచైజీ కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయగా జట్టు కోచ్‌గా టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా వ్యవహరించనున్నారు. ఇకపోతే గుజరాత్ టైటాన్స్ మార్చి 28న తొలి మ్యాచ్ వాంఖడే వేదికగా లక్నో సూపర్ జాయంట్స్‌తో తలపడనుంది.
కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఈ ఏడాది రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. రాష్ట్రంలోని చౌరాసియాకు చెందిన హార్దిక్‌కు ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది గుజరాత్ ఫ్రాంచైజీ. అయితే, పాండ్యా గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆల్ రౌండర్‌గా వ్యవహరించాడు. ఈ ఏడాది కొత్త టీములు రాకతో పాత జట్లు తమ కీలక ఆటగాళ్లను అంటిపెట్టుకుని మిగతా ఆటగాళ్లను విడిచిపెట్టింది. దీంతో పాండ్యాకు తొలిసారి కెప్టెన్ అయ్యే అవకాశం దక్కగా గుజరాత్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఎంత మేర ఫలిస్తుందో వేచి చూడాలి.
టాప్ ఆర్డర్ వీక్..
గుజరాత్ జట్టులో టాప్ ఆర్డర్ ఎవరు వస్తారని దానిపై కొంత ఆందోళన నెలకొంది. పవర్ ప్లే లో కనీసం 50 పరుగులు సాధించే సత్తా ఇప్పుడున్న బ్యాటర్ల పై పెద్దగా కనిపించడం లేదని తెలుస్తోంది. జట్టులో హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, డొమినిక్ డ్రాక్స్, బి సాయి సుదర్శన్ వంటి ఆల్ రౌండర్స్ ఉన్నారు. ఓవర్‌కు 10 నుంచి 12 పరుగులు సాధించే వారిలో శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా, అభినవ్ పేరు వినబడినా వీళ్లు ఎంతమేర సక్సెస్ అవుతారో వేచి చూడాలి.
బౌలర్లే జట్టుకు బలం..
గతంలో సన్ రైజర్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆఫ్ఘన్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఈసారి గుజరాత్ టీం కి ఆడుతున్నాడు. ఇతనితో పాటు పేసర్ మహ్మద్ షమీ, ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్ వాన్, అల్జారి దయాల్, వరుణ్ ఆరోన్, జయంత్ యాదవ్, నూర్ అహ్మద్, సాయి కిషోర్, దర్శన్ నల్ కండే, ప్రదీప్ సంగ్ వాన్ లాంటి వారు కీలకంగా మారనున్నారు.
సమిష్టి కృషితోనే ఫలితం..
గుజరాత్ జట్టులో సీనియర్ ప్లేయర్లు పెద్దగా ఎవరూ కనిపించడం లేదు. అందరూ కుర్రాళ్లే ఉన్నారు. నాయకత్వం బాధ్యతలు చేపట్టడం హార్దిక్ పాండ్యాకు ఇదే తొలిసారి కావడం కూడా టోర్నీ ప్రారంభం లో జట్టు కొంతమేర ప్రతికూల ఫలితాలను చూడొచ్చు. అయితే, టోర్నీలు జరిగే కొద్ది ప్రతికూల ప్రభావాలను కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంచనా వేసి ప్రత్యర్థి జట్లను గుజరాత్ టీం అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో కట్టడి చేయగలిగితే ఈ ఏడాది ఐపీఎల్‌లో టైటాన్స్ టీముకు మంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంది.