హరితహారం కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యం!

by Web Desk |
హరితహారం కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యం!
X

దిశ, ములకలపల్లి: పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యంతో నీరుగారుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెంచుతున్న నర్సరీల్లో పర్యవేక్షణ కరువై.. మొక్కలు పెద్ద మొత్తంలో ఎండిపోతున్నాయి. ప్రతి రోజు నర్సరీలను పర్యవేక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు, గ్రామ కార్యదర్శుల నిర్లక్ష్యం మొక్కల పాలిట శాపంగా మారింది. అడుగడుగునా నిర్లక్ష్యం మూలంగా సీతారాంపురం నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి.



ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెరుగుతున్న వివిధ రకాల మొక్కలు పెద్ద సంఖ్యలో ఎండిపోయి కనిపిస్తున్నాయి. రోజుల తరబడి నీరు లేకుండా వదిలేసినట్లు అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. బుధవారం సాయంత్రం నర్సరీలో మొక్కలను 'దిశ' పరిశీలించగా.. సగానికిపైగా ఎండిపోయిన బెడ్లు కనిపించాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడవుల శాతం పెంచి, పర్యావరణం పెంచేందుకు హరితహారం పేరుతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇంటింటికి మొక్కలను అందిస్తుంది. నర్సరీలో మొక్కలు పెంచేందుకు కావాల్సిన అన్ని వసతులు కనిపిస్తున్నప్పటికీ వాటిని పర్యవేక్షించే దగ్గర లోపాల మూలంగా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు నర్సరీల నిర్వహణ పై శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed