- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. ఉచిత శిక్షణ
దిశ ప్రతినిధి, మేడ్చల్: జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే వారికి ఉచిత నాన్ రెసిడెన్షిల్ విధానంలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం వివిధ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
పోలీస్ శాఖ ఉద్యోగాల కోసం.. (షెడ్యూల్ కులాల అభ్యర్థులు) జిల్లా వ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాల నిరుద్యోగ అభ్యర్థులు పోలీస్ శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు సిద్ధమవుతున్న వారికి 60 రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ విధానంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 30 ఏండ్ల వయసున్న వారు సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టు కోసం డిగ్రీ, 27 ఏండ్ల వయసున్న వారు కానిస్టేబుల్ పోస్ట్ కోసం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన షెడ్యూల్ కులాలు అభ్యర్థులు ఈ నెల 7 నుండి 12 న 5 గంటల లోపు ఆన్‌లైన్ https://scdevelopmentdepartment.cgg.govt.in లో దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
గ్రూప్స్ కోసం.. (షెడ్యూల్ కులాల అభ్యర్థులు)
జిల్లా వ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాల నిరుద్యోగ అభ్యర్థులు గ్రూప్ I,II,III,IV పోస్టులకు సిద్ధమవుతున్న వారికి 45 నుంచి 60 రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ విధానంలో ఈ నెల 25 నుండి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ కులాలు అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 18న తేదీల్లో 5గంటల లోపు ఆన్‌లైన్ https://scdevelopmentdepartment.cgg.govt.in లో దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
పోలీస్, గ్రూప్ I, IV పోస్టుల కోసం.. (గిరిజన కులాల అభ్యర్థులు)
జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన కులాల నిరుద్యోగ అభ్యర్థులు గ్రూప్ I, IV పోస్టులకు సిద్ధమవుతున్న వారికి 45 రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ విధానంలో ఈ నెల 25 నుండి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గిరిజన కులాలు అభ్యర్థులు 18 నుంచి 47 ఏండ్ల వయసున్న వారు ఈ నెల 9 నుంచి 18 న 5 గంటల లోపు ఆన్‌లైన్ https://ststudycircle.cgg.govt.inలో దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రకటించిన ఉచిత శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకుని పట్టుదలతో కష్టపడి ఉద్యోగ అవకాశాలు పొందాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ పేర్కొన్నారు.