నా కొడుకుకు పెన్షన్ ఇప్పించండి సారూ..

by samatah |   ( Updated:2022-03-14 09:54:04.0  )
నా కొడుకుకు పెన్షన్ ఇప్పించండి సారూ..
X

దిశ వికారాబాద్ : పుట్టుకతోనే వికలాంగుడిగా పుట్టిన నా కొడుకుకు పెన్షన్ ఇప్పించండి అని వికారాబాద్ జిల్లా, బంటారం మండలం, సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన గుడిసె వీరేశం ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. తన కొడుకు పుట్టుకతో వికలాంగుడు కాగా, తెలంగాణ ప్రభుత్వంలో ఇంతవరకు సదరం సర్టిఫికెట్ ఇవ్వలేరు పెన్షన్ కూడా రావడం లేదని, ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిహులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో అసలైన వికలాంగులకు అన్యాయం జరుగుతుందని, నకీలు వికలాంగులు, అర్హత లేని వికలాంగులు పెన్షన్ లు పొందుతున్నారని తీవ్రంగా మండి పడ్డారు. తెలంగాణలో వితంతువు, వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్‌లు, చాలా మంది నకిలీలు తీసుకొని, తెలంగాణ ప్రభుత్వం సొమ్మును వృధా చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చూసి రాజకీయ నాయకులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అసలైన లబ్ది దారులకు పెన్షన్‌లు రాక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అసలైన బాధితులకు న్యాయం చేయాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిహులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్కేల్లి శాంత్ కుమార్, బేగరి అంజిలయ్య, ఎక్కేల్లి రామయ్య, మొండి యేసు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed