అక్కడ కొవిడ్ డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 20 వేల కరోనా కేసులు

by Harish |
అక్కడ కొవిడ్ డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 20 వేల కరోనా కేసులు
X

బీజింగ్ : చైనాలో కొవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఊహించిన దాని కంటే రెట్టింపు స్థాయిలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఒక్కరోజే షాంఘై నగరంలో 20,472 కొత్త కేసులు వెలుగు చూసినట్లు అధికారులు పేర్కొన్నారు. పాండమిక్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంతటి స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం చైనాలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి కంట్రోల్ కావడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ మ్యుటేషన్‌తో అత్యధిక కేసులు నమోదవుతున్నట్టు చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, మరణాలు మాత్రం సంభవించలేదని తెలిపింది. ప్రస్తుతం చైనాలో 25 మిలియన్ల ప్రజలు నిర్బంధంలో కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా నమోదైన కేసులతో పోలిస్తే ఒక్క షాంఘైలోనే 80 శాతం పాజిటివిటీ రేటు ఉందని జాతీయ గణాంకాలు వెల్లడించాయి. కాగా, దేశ పౌరులు మరోసారి టెస్టులు చేయించుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని చైనా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story