- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నీ సంగతి చెప్తా.. నీ ఏఈ సంగతి చెప్తా'.. కార్పొరేటర్ భర్త బెదిరింపులు..
దిశ, మేడిపల్లి: ఓ డివిజన్ కార్పొరేటర్ భర్త రెచ్చపోయి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే అధికారిని బూతులు తిట్టిన ఘటన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కార్పొరేషన్ పరిధిలో ఇంజనీరింగ్ విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసే ఉద్యోగిపై స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఓ కార్పొరేటర్ భర్త రోడ్డు పనుల విషయమై ఫోన్‌లో పత్రికలలో రాయాలేని భాషలో బూతులు తిట్టిన ఆడియో రికార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వర్క్ ఇన్స్పెక్టర్‌తో మాట్లాడుతూ.. నీ సంగతి చెప్తా.. నీ ఏఈ సంగతి చెప్తా.. నా డివిజన్‌లో రోడ్లను లెక్కచేయకుండా 16వ డివిజన్‌లో ఎలా పూర్తి చేస్తారు అంటూ ఇష్టానుసారంగా బూతులతో రెచ్చిపోయాడు. జరిగిన సంఘటనపై సంబంధిత అధికారుల వివరణ అడిగేందుకు ప్రయత్నించగా అధికారులు అందుబాటులోకి రాలేదు.
కేసు నమోదు చేసి అనర్హత వేటు వేసే వరకు ఉద్యమం..
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ మహిళ కార్పొరేటర్ భర్త విచక్షణ కోల్పోయి కార్పొరేషన్ ఉద్యోగి పట్ల అసభ్య పదజాలం ఉపయోగించిన సంఘటన హేయమైన చర్య అని.. అతనిపై కేసు నమోదు చేసి, సదరు మహిళ కార్పొరేటర్ పదవీ నుండి తొలగించే వరకు ఉద్యమం చేస్తామని మున్సిపల్ ఉద్యోగుల సంఘం నేత కోట వెంకటేశ్వర్లు అన్నారు.