- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యుద్ధం కారణంగాదెబ్బతింటున్న ఉక్రెయిన్ వాతావరణం.. హెచ్చరించిన ప్రభుత్వం
by Manoj |
X
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా 4వారాలుగా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో అక్కడి వాతావరణం తీవ్రంగా దెబ్బతింటున్నది. గాలిలో నాణ్యత స్థాయి రోజురోజుకు పడిపోతున్నది. ముఖ్యంగా రాజధాని కీవ్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ కమ్మేస్తున్నది. వాయు నాణ్యతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శక విలువ కంటే, ప్రస్తుతం కీవ్‌లోని గాలిలో కాలుష్య కారకాల సాంద్రత 27.8రెట్లు అధికంగా ఉందని ఉక్రెయిన్‌లోని వాయు నాణ్యత సూచిక నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా, కీవ్‌లోని ప్రజలు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని మీడియా ఆర్గనైజేషన్ నెక్స్టా తెలిపింది. ఈ నేపథ్యంలో పౌరులెవరూ ఇళ్లు దాటి బయటకు రాకూడదని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆదేశించింది. ఇంటి కిటికీలు, తలుపులు తెరవద్దని సూచించింది.
Advertisement
Next Story