- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IndiGo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు అరుదైన ఘనత.. దేశంలో టాప్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో మార్చిలో ప్రయాణీకుల పరిమాణంలో ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద క్యారియర్‌గా అవతరించింది. UK-ఆధారిత అఫీషియల్ ఎయిర్‌లైన్ గైడ్ (OAG) ప్రకారం, ఇండిగో మార్చి నెల ఫ్రీక్వెన్సీలో 41.3 శాతం వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థగా పేరుపొందింది. మార్చి 28 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం, ఈ నెలలో ఎయిర్‌లైన్ 2.02 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రయాణీకులను తీసుకువెళ్లింది. సీట్ కెపాసిటీ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో స్థానం సంపాదించింది. OAG డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 20 అతిపెద్ద ఎయిర్‌లైన్స్ జాబితాలో భారతదేశం నుండి ఇండిగో సంస్థ మాత్రమే నిలిచింది. ఇండిగో హోల్‌టైమ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోనోజోయ్ దత్తా మాట్లాడుతూ, "ప్రపంచంలోని అగ్రశ్రేణి ఎయిర్‌లైన్స్‌లో ఇండిగోను చూడటం చాలా ఉత్సాహంగా ఉంది. ఇది భారత దేశానికి గర్వకారణం, మహమ్మారి నుండి దేశం బలంగా పుంజుకుంటోందనడానికి బలమైన సూచిక. తక్కువ ధరలో, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి ఇండిగో సంస్థ ఎప్పుడు ముందుంటుందని'' అన్నారు.