బీస్ట్ మూవీ ట్రైలర్.. యాక్షన్ ఎలిమెంట్స్‌తో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్

by Harish |
బీస్ట్ మూవీ ట్రైలర్.. యాక్షన్ ఎలిమెంట్స్‌తో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్
X

దిశ, సినిమా: నెల్సన్ దర్శకత్వంలో దళపతి విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కిన 'బీస్ట్' మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఈరోజే రిలీజ్ చేసింది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్‌లో విజయ్ పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ నటోరియస్ స్పై సోల్జర్ పాత్రలో కనిపించాడు. స్టోరీ విషయానికొస్తే.. సిటీలోని ఓ మాల్‌ను టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. అందులోనే విజయ్, పూజా హెగ్డే కూడా ఉంటారు. ఈ మేరకు సినిమా మొత్తం హైజాక్ అయిన ఆ మాల్ నుంచి జనాలను సేవ్ చేయడం చుట్టే తిరుగుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే ఇందులో పూజాపై ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఇక విజయ్ 'భయంగా ఉందా? దీని తర్వత ఇంకా భయంగా ఉంటుంది' అని చెప్పిన డైలాగ్‌లో ఎక్స్‌ప్రెషన్‌తో అదరగొట్టాడు.



Advertisement

Next Story