- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాన్సర్ పేషెంట్‌ను కాపాడేందుకు ఒక్కటైన ఆలయ, మసీదు ప్యానెల్స్!
దిశ, ఫీచర్స్ : 18ఏళ్ల అమ్మాయిని క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడేందుకు ఆలయ, మసీదు కమిటీలు ఒక్కటయ్యాయి. కోట్లలో విరాళాలు సేకరించి బాధితురాలిని రక్షించేందుకు ముందుకొచ్చాయి. ఈ విషయం నెట్టింట వైరల్ కాగా మతసామరస్యానికి నిదర్శనం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.
కేరళ, కొట్టక్కల్‌కు చెందిన హనా అనే అమ్మాయి క్యాన్సర్ బారినపడింది. చికిత్స కోసం తక్షణ సాయం కోరుతూ మసీదు కమిటీ, ఆలయ కమిటీలను సంప్రదించిన హనా.. ఊహించలేనంత మద్దతు పొందింది. మసీదు కమిటీ రూ. 1.5 కోట్లకుపైగా విరాళాలు సేకరించగా.. ఇందులో కుట్టిపురతుకావ్‌కు చెందిన భగవతి ఆలయ కమిటీ రూ.50వేలు, నరసింహ మూర్తి ఆలయ కమిటీ రూ. 27వేలు విరాళంగా ఇచ్చింది.
క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ అమ్మాయికి నిధులు సేకరించేందుకు కృషి చేస్తున్న మసీదు కమిటీకి ఈ సహకారం అందించడం మాకు సంతోషంగా ఉంది. రెండు వర్గాల ప్రజలు కలిసి ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సమాజానికి శ్రేయస్కరం. అయితే మేం వారికి సాయం చేయడం ఇదే మొదటిసారి కాదు అలాగే ఆలయ పునర్నిర్మాణంలో ఉన్నప్పుడు, మసీదు కమిటీ సభ్యులు కూడా తమవంతు సహకారం అందిస్తుంటారు.
- అజిత్ కుమార్, ఆలయ కమిటీ కార్యదర్శి.
అనేక దశాబ్దాలుగా సంపూర్ణ సామరస్యంతో జీవిస్తున్నందున ఇది మాకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించే అంశం కాదు. మా కమ్యూనిటీ ప్రజలు ఎల్లప్పుడూ మా పొరుగు దేవాలయాలలో నిర్వహించే ప్రతీ కార్యక్రమాన్ని జరుపుకోవడంలో గొప్ప ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. మతం పేరుతో విడిపోయిన సందర్భాలు చూసిన మేము కలిసి జీవించడాన్నే ఇష్టపడుతాం. ఇప్పుడు కూడా అందరి మద్దతుతోనే బాలిక చికిత్సకు సరిపడా నిధులు సేకరించగలిగాం
- మసీదు కమిటీ