- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మన సినిమాలకు అవార్డులు రావడం ఆనందంగా ఉంది : నిర్మాతల మండలి
దిశ, సినిమా : భారత ప్రభుత్వం ప్రకటించిన 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఆహ్వానిస్తూ 'తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్' ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ప్రాంతీయ భాషల్లో ఉత్తమ చిత్రంగా 'కలర్ ఫొటో', ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్(అల వైకుంఠపురంలో), బెస్ట్ కొరియోగ్రఫీ సంధ్యా రాజు(నాట్యం), బెస్ట్ మేకప్ టీవీ రాంబాబు(నాట్యం)ను ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. అలాగే అవార్డులు పొందిన సూర్య, అపర్ణ బాలమురళి, సుధా కొంగర, షాలినీ నాయర్, జి.వి. ప్రకాష్ కుమార్, జ్యోతిక, శ్రీ గునీత్ మోంగాల, శ్రీ వసంత్, వసంత్ సాయిలను అభినందించింది. ఇక 'డొల్లు', 'తలేదండ', 'తింకల్‌జా నిశ్చయం', 'అయ్యప్పనుమ్ కోషియుమ్', 'మాలిక్', 'కప్పిల' సినిమాకు పనిచేసిన వాళ్లతోపాటు 68వ జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎంపికైన కళాకారులు, సాంకేతిక నిపుణులందరికీ గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయనిర్ణేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.