పూర్వ వైభవం దిశగా తెలంగాణ పర్యాటకం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Nagaya |
పూర్వ వైభవం దిశగా తెలంగాణ పర్యాటకం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్​తో గత రెండేళ్ల నుంచి పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర టూరిజం రంగంలో అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. హెచ్ఐసీసీలో మంగళవారం ట్రావెల్స్ అండ్ టూరిజం ఫెయిర్ ను మంత్రి ప్రారంభించారు. ఈ ఫెయిర్ కు 4 దేశాలు, భారత్ లోని 19 రాష్ట్రాల టూరిజం ప్రతినిధులు వచ్చి150 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు, భూదాన్ పోచంపల్లికి వరల్డ్ బెస్ట్ టూరిజం విల్లేజ్ గా గుర్తింపు వచ్చిందన్నారు. పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రాచుర్యం లభించేలా టూరిజం ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కరివేన, ఉద్ధండ పూర్ రిజర్వాయర్ల ప్రాంతాల్లో టూరిజంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలో అతిపెద్ద అర్బన్ ఎకో టూరిజం పార్క్ కేసీఆర్ ఎకో పార్క్ అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఇండియా టూరిజం రీజినల్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, టీటీఎఫ్ చైర్మన్ సంజీవ్ అగర్వాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story