Governor Tamilisai: విమానంలో అదరగొట్టిన గవర్నర్.. 'మీరు గ్రేట్ మేడం' అంటూ ప్రయాణికుల ప్రశంసలు

by GSrikanth |   ( Updated:2022-08-11 07:40:06.0  )
Telangana Governor Tamilisai Treats sick passenger on Flight
X

దిశ, వెబ్‌డెస్క్: Telangana Governor Tamilisai Treats sick passenger on Flight| తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి మానవత్వం చాటుకున్నారు. రాజకీయాలకు రాక మునుపు ఆమె వైద్య వృత్తిలో కొనసాగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ప్రయాణిస్తున్న విమానంలో ఓ వ్యక్తి అనారోగ్యానికి గురికాగా.. హుటాహుటిన స్పందించిన గవర్నర్ అతడికి వైద్య చికిత్స అందించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో గవర్నర్ తమిళిసై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతుండగా విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా? అని సిబ్బంది అనౌన్స్ చేశారు. విషయం తెలుసుకున్న తమిళి సై వెంటనే స్పందించారు. ఆ ప్రయాణికుడి వద్దకు వెళ్లి ప్రాథమిక చికిత్స అందించి భరోసా కల్పించారు. దాంతో కోలుకున్న సదరు ప్రయాణికుడు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అత్యవసర సమయంలో తమిళి సై స్పందించిన తీరు, ప్రయాణికుడికి చికిత్స అందించిన విధానంతో తోటి ప్రయాణికులు సైతం అభినందనలు తెలిపారు.

ఈ విషయాన్ని తోటి ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టులు చేయగా నెటిజన్లు ప్రశంసలు కురిపిసుస్తున్నారు. మీరు గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అలాగే గొప్ప వైద్యులు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా మెడికల్ వింగ్ కార్యదర్శిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన తమిళిసై తాను రాజకీయాల్లోకి రాక మునుపు వైద్య వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. చెన్నైలోని మద్రాస్ మెడికల్ కాలేజ్‌లో ఆమె MBBS పూర్తి చేశారు. అలాగే డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ కాలేజ్ నుంచి డీజీఓ కోర్సు పూర్తి చేశారు. కెనడాలో సోనోలాజీ మరియు ఎఫ్ఈటీ థెరపీలలో ప్రత్యేక శిక్షణను కూడా పొందారు. ఆ తర్వాత చెన్నైలోని శ్రీరామచంత్ర మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన తమిళిసై.. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా ఫిజీషియ‌న్‌గా సేవ‌లందిస్తుండ‌టంతో ఆమె అంద‌రికీ సుప‌రిచితులు.

ఇది కూడా చదవండి: TRS కు బిగ్ షాక్... మాజీ ఢిల్లీ అధికార ప్రతినిధి రాజీనామా

Advertisement

Next Story