DH Srinivasa Rao: మాస్కు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా.. ఫోర్త్ వేవ్‌పై తెలంగాణ డీహెచ్ వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2022-04-21 11:48:47.0  )
DH Srinivasa Rao: మాస్కు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా.. ఫోర్త్ వేవ్‌పై తెలంగాణ డీహెచ్ వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: DH Srinivasa Rao| ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకుంటున్న తరుణంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా.. భారత్‌లోనూ పలు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ ప్రారంభం కావడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా.. కరోనా ఫోర్త్ వేవ్‌‌పై తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా డీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా నిబంధనలు ఎత్తివేయలేదని అన్నారు. ఇకనుంచి రాష్ట్రంలో అందరూ మాస్కు తప్పక ధరించాలని సూచించారు. మాస్కు ధరించకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

అంతేగాక, సీరో సర్వే ప్రకారం తెలంగాణలో ఫోర్త్‌వేవ్ రాదని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు(DH Srinivasa Rao) తెలిపారు. మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. వయసుల వారీగా అర్హత ఉన్నవారు వ్యాక్సిన్‌ తీసుకోవాలని తెలిపారు. థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, అనేక సందేహాలు వున్నాయని అన్నారు. తెలంగాణలో రోజుకు 20 నుంచి 25 కరోనా కేసులు మాత్రమే నమోదవుతున్నాయని, ప్రస్తుతం మహమ్మారి అదుపులోనే వుందని డీహెచ్ స్పష్టం చేశారు. ఏప్రిల్, మే, జూన్ వరకు వివాహాలు, విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయని, దాంతో జనాలు రద్దీగా ఉండే అవకాశం ఉందని, ఈ క్రమంలో వైరల్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. కావున రానున్న మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed