మతిస్థిమితం లేని విద్యార్థిపై టీచర్​ దాడి

by Vinod kumar |   ( Updated:2022-03-14 11:51:30.0  )
మతిస్థిమితం లేని విద్యార్థిపై టీచర్​ దాడి
X

దిశ, ఖమ్మం రూరల్: మతిస్థిమితం లేని విద్యార్థిపై ఓ టీచర్​దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రూరల్​ మండలం పెద్ద తండా పంచాయతీ పరిధిలోని నాయుడుపేటలో గల కరుణగిరిలో క్రిస్టియన్​పాఠశాల ఉంది. ఇదే పంచాయతీకి చెందిన ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఓర్స్​ క్రాంతి కుమార్​కుమారుడు అజయ్​ కుమార్ కి మతిస్థిమితం లేకపోవడంతో అతనిని గత మూడు నెలల క్రితం కరుణగిరి పాఠశాలలో చేర్పించాడు. 25 రోజుల క్రితం ఓర్స్​అజయ్​కుమార్​కంటి దెబ్బ తగలడంతో ప్రథమ చికిత్స కోసం హాస్పిటల్‌‌‌లో చేర్పించాడు.


మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌‌‌‌లో గల ఓ ప్రైవేట్​హాస్పిటల్‌‌‌‌లో చేర్పించి చికిత్స అందించాడు. పరిశీలించిన అక్కడి డాక్టర్లు అజయ్​కుమార్​కంటికి దెబ్బ ప్రమాదవశాత్తు తగ్గలేదని, కంటిపై దాడి చేయడం వలనే ఇలా జరిగి ఉంటుందని వైద్యులు చెప్పారు. తాజాగా సోమవారం విద్యార్థిని ఇంటికి తీసుకురాగా కరుణగిరిలో జిమ్​చేసే యువకులు అజయ్​కుమార్​కంటికి ఉపాధ్యాయుడు కొట్టడం వలన జరిగిందని తెలపడంతో విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు కలిసి బిషప్​ను అడిగేందుకు వచ్చారు. మతిస్థిమితం లేని మా కుమారునిపై దాడి చేయడం సరికాదని స్థానికులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని బిషప్​ను ప్రశ్నించారు.


బిషప్​ సమాధానం చెప్పకుండా ఆందోళనకారులపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు బిషప్​హౌస్​ఎదుట ఆందోళన చేపట్టారు. బిషప్​సమాధానం సరిగ్గా లేదని, గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగిన పట్టించుకునే నాథుడే లేడని వారు వాపోయారు. ఈ మేరకు విద్యార్థి తల్లిదండ్రులు రూరల్​పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed