- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం జగన్ చిత్రపటంపై మద్యాభిషేకం చేసిన టీడీపీ నేతలు
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కల్తీ సారా, నాటుసారా, జే బ్రాండ్ మద్యాన్ని నిషేధించాలంటూ సోమవారం టీడీపీ నేతలు నిరసన తెలిపారు. అసెంబ్లీ, మండలి సమావేశాల ప్రారంభానికి ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిషేకం చేశారు.
సీఎం ఫోటోపై మద్యం పోసి వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. మద్య నిషేధం హామీ గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. కల్తీ నాటుసారాతో పాటు జే బ్రాండ్‌తో జగన్ రెడ్డి జనాల ప్రాణాలు తీస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రాన్ని జే బ్రాండ్ మద్యం, కల్తీ సారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని మండిపడ్డారు. నాటు సారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జే బ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ వరుసగా అయిదో రోజు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం నిరసనకు దిగింది. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానన్న సీఎం జగన్ హామీ ఏమైందని టీడీపీ శాసన సభాపక్షం ప్రశ్నించింది. ప్రభుత్వానికి మద్యం ఆదాయంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని తీవ్రంగా విమర్శించింది.