NTR: ఆ రెండు ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్త పడుతున్న తారక్ ?

by Prasanna |   ( Updated:2024-10-10 10:03:34.0  )
NTR: ఆ రెండు ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్త పడుతున్న తారక్ ?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిక్స్డ్ టాక్ తో ముందుకెళ్లినా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 400 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే, దేవర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కడా కూడా లీక్ చేయలేదు.

ఇక్కడ తారక్ తెలివిని అందరూ మెచ్చుకుంటున్నారు. కొత్త సినిమాల లీక్స్ ఇవ్వడానికి ఎన్టీఆర్ అస్సలు ఇష్టపడలేదని కామెంట్లు చేస్తున్నారు. వార్2, తారక్ ప్రశాంత్ నీల్ మూవీ అప్ డేట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో దేవర సినిమాతో మార్కెట్ ను పెంచుకున్నారనే చెప్పాలి. 12 రోజుల్లో దేవర మూవీకి రూ. 210 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. దసరా సెలవులు కూడా కలిసి రావడంతో కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేవర సీక్వెల్ 2025 అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

Advertisement

Next Story