vitamin supplements: విటమిన్ సప్లిమెంట్స్ అధికంగా తీసుకుంటున్నారా?

by Anjali |
vitamin supplements: విటమిన్ సప్లిమెంట్స్ అధికంగా తీసుకుంటున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్: అతిగా విటమిన్ ట్యాబ్లెట్లు మింగుతున్నారా..?అయిదే శరీరంలో విటమిన్ల స్థాయి మోతాదుకు మించి ఎక్కువైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు విటమిన్ల స్థాయి అధికమైతే.. కడుపులో ఏదోలా ఉంటుంది. అలాగే కొందరికి గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. తరచూ విటమిన్ సప్లిమెంట్స్ (vitamin supplements) తీసుకుంటే రక్తం గడ్డ కడుతుంది. రక్తస్రావం, హెమరేజిక్ స్ట్రోక్ కు కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి.

విటమిన్ డి సప్లిమెంట్లు అధికంగా మింగితే విషపూర్తితంగ మారుతాయి. దీంతో ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. విరేచనాలు, మైగ్రేన్ సమస్య(Migraine problem), వాంతులు, ఆకలి తగ్గడం, గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, రక్తంలో కాల్షియం స్థాయిలను పెంచడం వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. అలాగే ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు.

విటమిన్ బి 12 టాబ్లెట్స్ అధికంగా మింగితే.. టాయిలెట్ ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్తుంది. తద్వారా కళ్లు తిరుగుతాయి. కొన్నిసార్లు వాంతులు(Calcium levels in the blood) అవుతాయి. తీవ్రమైన అలసట ఉంటుంది. కాగా విటమిమన్ సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పూర్తిగా తీసుకోకపోవడం కూడా మంచిదే అంటున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed