Surya Yantrasana Yoga: సూర్య యంత్రాసనం వేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

by Manoj |   ( Updated:2022-06-24 08:15:09.0  )
Surya Yantrasana Yoga Benefits
X

దిశ, ఫీచర్స్: Surya Yantrasana Yoga Benefits| ఈ ఆసనంలో విభిన్న పద్ధతులుంటాయి. ఈ రోజు మొదటి భంగిమ గురించి తెలుసుకుందాం. ముందుగా బల్లపరుపు నేలమీద వెల్లకిలా పడుకోవాలి. శరీరాన్ని కాసేపు రిలాక్స్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు మోకాళ్లను కొద్దిగా మడిచి పాదాలను రెండు ఫీట్లు, తొడలను ఒక ఫీటు పైకి లేపాలి. అలా పైకి లేచాకా చేతులుతో పాదాలను పట్టుకోవాలి. ఇప్పుడు తొడలను వీలైనంత వెడల్పు చేయాలి. పాదాలను రెండు చేతులతో ఇరుపక్కల బలంగా లాగి పట్టుకోవాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు శరీరం, తల పూర్తిగా నేలపై ఆన్చి ఉండాలి. మోకాళ్లు, మోచేతులు శరీరానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. అలా కాసేపు ఆగి తర్వాత రిలాక్స్ అవ్వాలి.

ప్రయోజనాలు:

* జీర్ణక్రియ ఉత్తమంగా పని చేసేందుకు సాయం.

* కాలు, చేతి కండరాలను సాగదీస్తుంది.

* వెన్నెముక, కండరాలను బలోపేతం చేస్తుంది.

* ఒత్తిడి తగ్గించి మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది.

Advertisement

Next Story