- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Surya: జ్యోతికపై సూర్య కీలక వ్యాఖ్యలు.. ఆ సమయంలో నేను భయపడేవాడినంటూ
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దిశా పటానీ(Disha Patani) హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీ నవంబర్ 14న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, సూర్య ప్రమోషన్స్‌లో పాల్గొని తన భార్య జ్యోతిక(Jyotika)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘డోలీ సజా కే రఖ్నా’ అనే బాలీవుడ్ సినిమాతో జ్యోతిక(Jyotika) ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె నటించిన రెండో చిత్రం నాతోనే. అది నా ఐదో చిత్రం అయినప్పటికీ నేనెంతో భయపడేవాడిని. డైలాగ్స్ మర్చిపోయేవాడిని. మధ్య మధ్యలో తడబడేవాడిని. తను అలా కాదు తమిళంలో తొలి చిత్రమే అయినా డైలాగ్స్ చాలా స్పష్టంగా చెప్పేది.
వర్క్‌పై ఎంతో శ్రద్ధ చూపించేది. అది నాకెంతో నచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులయ్యాం. ఒకరిపై ఒకరికి గౌరవం ఏర్పడింది. కెరీర్ ఆరంభంలోనే తను సక్సెస్ అందుకుంది. కానీ నాకు మాత్రం ఫస్ట్ సక్సెస్ అందుకోవడానికి నాకు ఐదేళ్లు పట్టింది. ‘కాక్క కాక్క’ మూవీ కోసం మేమిద్దరం కలిసి వర్క్ చేశాం. ఆ చిత్రానికి నా కంటే మూడు రేట్లు ఎక్కువ రెమ్మునరేషన్ తను అందుకుంది. కెరీర్ పరంగా అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలిసినప్పటికీ తను నాతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడింది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ సూర్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇక ఈ విషయం తెలిసిన వారంతా గ్రేట్ అని జ్యోతికను పొగుడుతున్నారు.