- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలతో నిఘా
by Nagaya |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానల్లో సర్కార్ నిఘా పెట్టింది. బస్తీ, ప్రైమరీ, అర్బన్ హెల్త్ సెంటర్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ స్టలేషన్ కొరకు ఈసీఐఎల్ సంస్థతో ఆరోగ్య శాఖ ఒప్పందo కుదుర్చుకున్నది. ఈ నెల చివరి నాటికి అన్ని దవాఖాన్లలో కెమెరాల ఇన్‌స్టాలేషన్ పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. దవాఖాన్లలోని పేషెంట్ వెయిటింగ్ హాల్, ఫార్మసీ, ఓపీ రూమ్‌ల్లో కెమెరాలను బిగించబోతున్నారు.
హైదరాబాద్‌లోని హెల్త్ డైరెక్టరేట్‌లో ఉండే కంట్రోల్ సెంటర్‌కు, సెక్రటేరియట్‌లో హెల్త్ సెక్రటరీ ఆఫీసుకు, మంత్రి పేషీకి ఈ కెమెరాలను అనుసంధానించనున్నారు. దీంతో ఏయే దవాఖానలో ఏంజరుగుతుందో ఇక్కడి నుంచే మానిటర్ చేయనున్నారు. ఇప్పటికే మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో కెమెరాలు ఇన్‌స్టాల్ చేసి, వాటి పనితీరును పరిశీలిస్తున్నారు.
Advertisement
Next Story