- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌కు రైనా రీ ఎంట్రీ.. ఈ సారి రచ్చ రచ్చే..
న్యూఢిల్లీ: టీమ్ ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రైనా.. ఆ తర్వాత కూడా ఐపీఎల్‌లో కొనసాగాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నయ్ సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ప్రాతినిథ్యం వహిస్తున్న రైనా.. కెప్టెన్ ధోని తర్వాత చిన్న తలాగా గుర్తింపు పొందాడు. చెన్నయ్ విజయాల్లో ఎన్నోసార్లు కీలకపాత్ర పోషించాడు. అయితే, 2022 వేలంలో చెన్నయ్ జట్టు రైనాపై ఆసక్తి చూపించలేదు.
అలాగే, ఏ ఇతర ఫ్రాంచైజీ సైతం రైనాను కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. ఐపీఎల్ ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. తాజాగా లీగ్‌లో కామెంటేటర్లు వ్యవహరించే ప్యానెల్ జాబితాను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది ఈ జాబితాలో రవిశాస్త్రి, హర్ష బోగ్లే, సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రాతో పలువురు పలు భాషల్లో వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. అయితే, సురేశ్ రైనా సైతం ఈ ఏడాది కామెంటేటర్‌గా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. రవిశాస్త్రితో కలిసి హిందీ భాషలో రైనా వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడు.