ఆ ఇబ్బందులు ఉన్నాయని.. రైల్వే ట్రాక్‌పై పడి యువకుడి ఆత్మహత్య!

by Vinod kumar |
ఆ ఇబ్బందులు ఉన్నాయని.. రైల్వే ట్రాక్‌పై పడి యువకుడి ఆత్మహత్య!
X

దిశ, బెజ్జూర్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగజ్నగర్ మండలం చింతగూడ చెందిన కట్ట రాజశేఖర్ (34) మృతి చెందాడు. ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు. తెలిసిన వారి దగ్గర నుంచి అప్పులు చేసి, అప్పులు తీర్చలేక, ఆర్థిక ఇబ్బందుల మనో వేదన గురై తన ఇంటి సమీపంలో గల చింతగూడ రైల్వే గేటుకు సమీపంలో రైలు పట్టాలపై వెళ్ళి.. బల్లార్ష నుండి మంచిర్యాల వైపుకు వెళ్ళె గూడ్స్ రైలుబండికి ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించగా మృతుని శవ పంచనామ, శవ పరీక్షల అనంతరం దహన సంస్కారాల నిమిత్తం మృతదేహాన్ని, మృతుని తండ్రి కట్ట వెంకట సత్యనారాయణ అప్పగించినట్లు హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపారు.



Advertisement

Next Story

Most Viewed