YSRTP భద్రాద్రి జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శిగా సుధారాణి..

by Satheesh |   ( Updated:2022-03-31 13:08:25.0  )
YSRTP భద్రాద్రి జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శిగా సుధారాణి..
X

దిశ, మణుగూరు: వైఎస్సార్ టీపీ భద్రాద్రి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా తాడిపర్తి సుధారాణిని నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరాల సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆదేశాలు మేరకు తాడిపర్తి సుధారాణిని జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు పేర్కొన్నారు. సుధారాణి పార్టీ కోసం ఎంతో కృషి చేస్తుందని.. పార్టీని ముందుండి నడిపించే సత్తా ఆమెకు ఉందనే ఉద్దేశ్యంతోనే ఆ పదవి ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదవి పొందిన తాడిపర్తి సుధారాణి మాట్లాడుతూ.. నామీద నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పదవి ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు, జిల్లా అధ్యక్షుడు నరాల సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story