- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మినోళ్లకు అమ్మినంత! విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
దిశ, వరంగల్ టౌన్: అమ్ముకున్నోళ్లకు అమ్ముకున్నంత అన్నట్లుగా మారిపోయింది వరంగల్ నగరంలోని మద్యం వ్యాపారం. ఉన్నతాధికారులు ఉండే వరంగల్ నగరంలో మరీ విచ్చలవిడిగా లిక్కర్ బిజినెస్ కొనసాగుతోంది. నకిలీ మద్యం, కల్తీ మద్యం, విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఎక్సైజ్ శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగరంలో వైన్స్ షాపుల పరిధిలో లెక్కలేనన్ని బెల్ట్ షాపులు కొనసాగుతున్నట్లు బాహాటంగానే చర్చ కొనసాగుతోంది.
ఇక బార్ షాపుల్లో మద్యం ప్రియులపై వ్యాపారుల దోపిడీ అంతా ఇంతా కాదు. బార్ షాపుల్లో మద్యం కొలతల్లో తేడాలు ఉన్నప్పటికీ వినియోగదారులు పెదవి విప్పని పరిస్థితి ఉంది. ఒకవేళ ఎవరైనా వ్యాపారులను నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఏ వ్యాపారంలో నైనా కస్టమర్లను దేవుళ్ళుగా భావించి, ఆ మేరకు వ్యాపారులు మర్యాదగా నడుచుకుంటారు. కానీ, మద్యం వ్యాపారంలో మాత్రం వ్యాపారులదే ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు మద్యం వ్యాపారులపై, ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణ లేక పోవడం, అజమాయిషీ లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. అంతే కాకుండా ఎక్సైజ్ శాఖ అధికారులకు వైన్స్ షాపుల వారిగా నెలనెల మామూళ్లు ముడుతున్నాయని మద్యం వ్యాపారులే బాహాటంగానే చర్చించుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఇదే ఇదే విషయమై వరంగల్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరిని వివరణ కోరగా.. మేమే అమ్మిస్తున్నాం.. సర్కారు విధించిన టార్గెట్ పూర్తి కావాలంటే బెల్ట్ షాపులు తప్పవు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం!