- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కూతురినే గర్భవతిని చేసిన మారుతండ్రి.. తల్లికి తెలియడంతో..
దిశ, కుత్బుల్లాపూర్: అండగా ఉండాల్సిన మారుతండ్రి మైనర్ బాలికపై లైంగికదాడి చేయడమే కాకుండా.. గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ రమణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేటకు చెందిన ఓ మహిళ డీసీఎం డ్రైవర్ తో గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది. అయితే ఆ మహిళ కుమార్తె(13)పై కసాయి మారుతండ్రి కన్నుపడింది. మాయ మాటలతో నమ్మించి గత కొంతకాలంగా ఆ బాలికపై లైంగికదాడి చేస్తున్నాడు. తీరా గర్భం దాల్చడంతో నిజాంపేటలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్ద అబార్షన్ చేయించినట్లు సమాచారం. సదరు బాలిక కొన్ని రోజులుగా నీరసంతో దూరంగా ఉంటుండడం ప్రారంభించింది. భయాందోళనకు గురై జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో మారుతండ్రిని నిలదీయగా అతడు దాటవేయడం ప్రారంభించాడు. బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.