- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీజీ సాయం చేయండి.. శ్రీలంక ప్రతిపక్ష నేత
కొలంబో: సంక్షోభంలో ఉన్న తమ దేశానికి సహాయం చేయాలని శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాసా కోరారు. 'దయచేసి శ్రీలంకకు గరిష్టంగా సాయం చేయండి. ఇది మా మాతృభూమి. మేము మా మాతృభూమిని రక్షించుకోవాలి' అని అన్నారు. రెండు రోజుల క్రితమే 40000 టన్నుల డీజిల్‌ను భారత్ శ్రీలంక పంపించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు 40000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా పంపించేందుకు సిద్ధమైంది. కాగా, శ్రీలంకలో రూపాయి విలువ పతనం అవడంతో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
విపక్షాలను ప్రభుత్వంలోకి స్వాగతం..
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ఆదివారం అర్ధరాత్రి ఏకంగా 26 మంది మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. దీంతో అధ్యక్షుడు గొటబెయె రాజపక్సా దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. అన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. అంతేకాకుండా దేశాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత సంక్షోభ పరిస్థితి నుంచి గట్టెక్కించే మార్గం చూపించాలని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన చేసింది. అధ్యక్షుడు గొటబెయె రాజపక్సా శ్రీలంక జాతీయ సంక్షోభ స్థితి నుంచి గట్టెక్కించేందుకు అన్ని పార్టీలను ఆహ్వానించారు అని ప్రకటనలో తెలిపారు. దీనిని దేశ అవసరంగా భావించి, పౌరులు, భవిష్యత్తు తరాల కోసం కలిసికట్టుగా పని చేయాలని ఆయన కోరారు. శ్రీలంక అధ్యక్షుడు అలీ సబ్రీని నూతన కేంద్ర మంత్రిగా సోమవారం నియమించారు. ఆయనతో సహా నలుగురిని శ్రీలంక కేబినెట్ మంత్రులుగా నియమించారు.