- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగ నియామకాలపై అసత్య ప్రచారం.. TSPSC చైర్మన్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని, అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. అయితే, ఈ ప్రకటనపై కొందరు నిరుద్యోగులు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. కేవలం ఎన్నికల స్టంట్‌గా మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన చేసిందని, ఇప్పుడప్పుడే టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలు ఇవ్వబోదని సామాజిన మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
తాజాగా.. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి స్పందించారు. ఉద్యోగ నియామకాల అంశంలో టీఎస్‌పీఎస్సీపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఇలా చేస్తే పరీక్షలు రాయకుండా అభ్యర్థులపై నిషేధం విధిస్తామని చెప్పారు. అసత్య ప్రచారం చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. అభ్యర్థులెవరూ ఆలోచించకుండా పోస్టులు పెట్టడం, ఎవరో పంపించినవి ఫార్వర్డ్ చేయరాదని సూచించారు.