ఫైనాన్స్ దందాపై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. గళం విప్పిన బాధితులు

by Manoj |   ( Updated:2022-03-25 10:50:26.0  )
ఫైనాన్స్ దందాపై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. గళం విప్పిన బాధితులు
X

దిశ, ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ కేంద్రంగా ఫైనాన్స్ దందాగాళ్లపై బాధితులు గళం విప్పడం ఆరంభించారు. కమిషనరేట్ వ్యాప్తంగా 37 చోట్ల పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన రెండు రోజులకు బాధిత సంఘం మీడియా ముందు తమ గోడు వెల్లబోసుకోవడం గమనార్హం. ఉజ్వల ఫైనాన్స్ యజమాని సుధాకర్ తమకు ఇచ్చిన అప్పును వడ్డీతో సహా కట్టినా బెదిరించి మరీ ఆస్తులు దోచుకున్నారని ఆరోపించారు.

పోలీసులు అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ అవసరాలను ఆసరాగా చేసుకున్న ఫైనాన్స్ మాఫియా సామాన్యుల పాలిట శాపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. కోట్ల విలువైన స్థిరాస్థులను తనాఖా పెట్టినందుకు తమను బెదిరింపులకు గురి చేసి ఖాళీ చేయించారన్నారు. ఫైనాన్స్ నిర్వహకులు భీమనాథుని సుధాకర్, అనురాధ సత్యనారాయణ, నిర్మల, కిరణ్ బాబులను అరెస్ట్ చేయాలని కోరారు.

Advertisement

Next Story