- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవికి 104 ప్రత్యేక రైళ్లు.. కొన్ని రూట్లలో వారానికి ఒక రైలు
దిశ, తెలంగాణ బ్యూరో: వేసవి కాలంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా వారిని వివిధ గమ్య స్థానాలకు చేర్చేందుకు 104 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు శనివారం దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. జోన్ పరిధిలోని సికింద్రాబాద్ నుంచి ఎర్నాకులం, మచిలీపట్నం నుంచి కర్నూలు టౌన్ మధ్య వారానికి ఒక ప్రత్యేక ట్రైన్ సర్వీస్, రద్దీని బట్టి వారానికి మూడు రోజులు ప్రత్యేక రైళ్లను నడపబోతున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్- ఎర్నాకులం- సికింద్రాబాద్‌కి రాకపోకలు సాగించడానికి ప్రత్యేకంగా 26 సర్వీసులు నడపబోతున్నట్లు, ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈఓర్డే, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాల్‌ఘాట్, త్రిసూర్, అలువా స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.
మచిలీపట్నం – కర్నూలు సిటీ - మచిలీపట్నానికి రాకపోకలు సాగించడానికి వారానికి మూడు రోజులు ప్రత్యేకంగా 78 సర్వీసులను నడపబోతున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంబం, గిద్దలూరు, నంద్యాల, ధోనే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయని ప్రకటించింది. ఈ రైళ్ల సర్వీసులో ఏసీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని తెలిపింది.