ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు రాజీనామాలు సమర్పించండి: సోనియా గాంధీ

by Harish |
ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు రాజీనామాలు సమర్పించండి: సోనియా గాంధీ
X

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆయా రాష్ట్రాల ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌లు వెంటనే రాజీనామాలు సమర్పించాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ విషయాన్ని పార్టీ నేత రణదీప్ సుర్జేవాలా మంగళవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెంటనే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పంజాబ్ చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఉత్తరాఖండ్ చీఫ్‌గా గణేష్ గొడియాల్, గోవా చీఫ్‌గా గిరీష్ చొడంకర్, మణిపూర్ చీఫ్‌గా లోకేన్ సింగ్, యూపీ చీఫ్‌గా అజయ్ కుమార్ లల్లూ ఉన్నారు. కాగా, సుర్జేవాలా ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే ఉత్తరాఖండ్ చీఫ్ గణేష్ రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. 'రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత నేనే వహిస్తున్నాను. నా రాజీనామాను సమర్పిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సుదీర్ఘ సమావేశం జరిగిన రెండు రోజులకు ఆయా రాష్ట్రాల చీఫ్‌లపై చర్యలకు దిగడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed