ఘోరం.. తండ్రిని కొట్టి తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంట్టించిన కొడకు

by Mahesh |   ( Updated:2022-03-27 14:36:44.0  )
ఘోరం.. తండ్రిని కొట్టి తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంట్టించిన కొడకు
X

దిశ, దౌల్తాబాద్: డబ్బు కోసం కొడుకు మృగం గా మారాడు. కన్న తల్లిదండ్రుల పై హత్యకు పాల్పడ్డాడు. తండ్రిని కర్రతో తలపై కొట్టి, తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. కొడుకుకు తోడుగా కోడలు కూడా తోడై మహిళ అనే పదానికి మచ్చ తెచ్చింది. తల్లిదండ్రులు చావుబతుకుల్లో దవాఖానలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ హృదయ విదారకరమైన ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొవిందాపూర్‌లో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు వివరాల ప్రకారం.. గోవిందా పూర్ గ్రామానికి చెందిన మైసయ్య పోశవ్వ వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం చిన్న కుమారుడు బోరు మోటర్ కింద పడుకుని ఉండగా నిద్రలో టైర్ ఎక్కడంతో మృతి చెందారు.

ఇటీవల భూమి అమ్మగా మూడు లక్షల 60 వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బును తనకు ఇవ్వాలని శనివారం పెద్దలతో పంచాయతీ నిర్వహించారు. ఆదివారం ఉదయం డబ్బులు ఇవ్వాలని మాట్లాడుతుండగా మాట మాట పెరిగి పెద్ద కుమారుడైన బాలమల్లు, భార్య కనుక కలిసి తండ్రి మైసయ్యను కర్రతో కొట్టి, తల్లి పోశవ్వ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. తల్లి పోశవ్వను గాంధీ‌కి తరలించారు. తండ్రిని సిద్ధిపేటలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దౌల్తాబాద్ ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed