- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోడు భూముల రైతుల కోసం దండుగా కదిలిన సీతక్క.. అధికారులకు ఫోన్‌లో వార్నింగ్.. వీడియో వైరల్
దిశ, కొత్తగూడ : ఎన్నో ఏళ్ల నుండి వ్యవసాయాన్నే జీవనాధారం చేసుకొని జీవిస్తున్న గిరిజన భూములపై అటవీ శాఖాధికారులు దాడులు చేసి ట్రంచ్ తీస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శనివారం మండలంలోని కార్లాయి సమీపంలో గిరిజనులు 30, 40 ఏండ్ల నుండి సాగు చేసుకుంటున్న పోడు భూములపై అటవీశాఖ అధికారులు అన్యాయంగా దాడులు చేసి ట్రెంచ్ పనులు ప్రారంభించారు. అయితే మండల కేంద్రానికి విచ్చేసిన ఎమ్మెల్యే సీతక్కను పోడు దారులు కలిసి విన్నవించుకున్నారు.
దీంతో తక్షణమే స్పందించిన సీతక్క కార్లాయి గ్రామానికి చేరుకొని పంట పొలాల మార్గం గుండా ద్విచక్ర వాహనంపై వెళ్లి ట్రెంచ్ పనులనులను అడ్డుకునే క్రమంలో అక్కడ నుండి అటవీ శాఖాధికారులు, జేసీబీ ఆపరేటర్ పరారయ్యారు. వెంటనే ఎమ్మెల్యే సీతక్క అధికారులతో చరవాణిలో(ఫోన్) మాట్లాడుతూ.. తాతలనాటి నుండి సాగు చేసుకుంటున్న భూముల్లో దాడులు చేసి ట్రెంచులు తీయడం ఎంతవరకు సమంజసమని, తక్షణమే దాడులు నిలిపి వేయాలని హెచ్చరించారు. జడ్పీటీసీ పూల్సం పుష్పలత శ్రీనివాస్, ఎంపీపీ విజయ రూప్ సింగ్, మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, సర్పంచ్ మల్లెల, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సుంకరబోయిన మొగిలి, బాబు, బత్తులపల్లి ఎంపీటీసీ బండి శ్రీనివాస్, వేణు, కార్లయి ప్రజలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.