కార్మికుల సమస్యలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా?

by S Gopi |
కార్మికుల సమస్యలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా?
X

దిశ, తాండూర్: గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలకు వారి గుర్తింపు ర‌ద్దు చేయ‌గానే కార్మికుల స‌మ‌స్యలు గుర్తుకువ‌స్తున్నాయ‌ని బెల్లంపల్లి ఏరియా హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు ప‌తెం రాజ‌బాబు విమ‌ర్శించారు. గోలేటి సీహెచ్‌పీలో కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఇంజనీర్ రాజుకు శనివారం విన‌తిప‌త్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిన్న, మొన్నటి దాకా పైరవీలు, సంపాదనకు ప్రాధాన్యతనిచ్చిన తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘ‌ నాయకులు ఇప్పుడు కార్మిక సమస్యలు పరిష్కరించాలని దొంగ పోరాటాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక స‌మ‌స్యలు ప‌రిష్కరించ‌కుండా యాజమాన్యంతో కుమ్మక్కై ఉచిత మ‌స్టర్లకు ఆశపడి కార్మికులకు తీరని అన్యాయం చేశార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీహెచ్‌పీలో యాక్టింగ్ చేస్తున్న కార్మికులకు ప‌దోన్నతి కల్పించాలన్నారు. సీహెచ్‌పీలో పదవి విరమణ చేసిన కార్మికుల స్థానంలో ఇత‌రుల‌ను నియమించకపోవడం వల్ల కార్మికుల సంఖ్య త‌గ్గింద‌న్నారు. సీహెచ్‌పీకి సరిపడా కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. కార్మికులందరి కీ ప్లేడేలు కల్పించాలని కోరారు. ఇక్కడ‌ ఎలక్ట్రికల్ సూపర్ వైజ‌ర్లు లేర‌ని.. వారిని వెంట‌నే నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీహెచ్‌పీ పిట్‌ సెక్రటరీ ఎండీ అరీఫ్, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed