- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పుంజుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఓ అవార్డుల ఫంక్షన్‌లో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన బదులిచ్చారు. 'ప్రజాస్వామ్యం రెండు చక్రాలపైన నడవాలి. అది ప్రభుత్వం కాగా, ఇంకోటి విపక్షం. బలమైన విపక్షం ప్రజాస్వామ్యానికి అవసరం. అందుచేత కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం కావాలని నేను కోరుకుంటున్నాను. దాంతో విపక్షం కూడా బలంగా ఉంటుంది' అని అన్నారు. నెహ్రూ దీనికి ఉదాహరణగా నిలిచారని చెప్పారు.
అటల్ బిహరీ వాజ్‌పేయి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, తగిన గౌరవం ఇచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ముఖ్యపాత్రను పోషిస్తుందని చెప్పారు. కాగా, గడ్కరీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ స్వాగతించారు. 'నితిన్ గడ్కరీ చూపించిన ఆసక్తిని మేము ప్రశంసిస్తున్నాం. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్ష పార్టీలను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల గురించి ఆయన తన నాయకుడు మోదీతో మాట్లాడాలి' అని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా నిస్సహాయంగా ఉందని విమర్శించారు.