బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన శ్రద్ధా కపూర్.. కారణమేంటో తెలుసా?

by Harish |
బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన శ్రద్ధా కపూర్.. కారణమేంటో తెలుసా?
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రేమ విఫలమైనట్లు తెలుస్తోంది. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్‌ శ్రేష్టతో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న నటి ఇటీవల డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ బ్రేకప్‌కి కారణం ఏమిటనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే మిగిలిపోగా.. ఇటీవల గోవాలో శ్రద్ధ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు రోహన్ హాజరవకపోవడంతో నెటిజన్లు చర్చకు దిగారు. దీంతో ఈ రూమర్స్‌పై స్పందించిన శ్రద్ధ.. 'ఇంకా చెప్పండి' అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ పిక్ పోస్ట్ చేసింది. ఇక వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నా.. ఎప్పుడూ పబ్లిక్‌గా తమ రిలేషన్ గురించి ప్రకటించలేదు. కానీ, ఎన్నో సార్లు ఇద్దరూ కలిసి మీడియా కంటపడగా డైరెక్ట్ పెళ్లి డేట్ ప్రకటిస్తారంటూ వార్తలు వినిపించాయి. ఇక శ్రద్ధ, రోహన్ చిన్ననాటి స్నేహితులు కాగా ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed