బ్రేకప్‌పై స్పందించిన ప్రభాస్ హీరోయిన్..

by Manoj |   ( Updated:2022-03-27 13:17:21.0  )
బ్రేకప్‌పై స్పందించిన ప్రభాస్ హీరోయిన్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ చిన్ననాటి నుండి మంచి స్నేహితులు. ఈ విషయం ఇండస్ట్రీ అంతా తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్ నిజమేనా?.. ఒకవేళ అదే నిజమైతే.. వారిద్దరు విడిపోవడానికి కారణం ఏమిటి? అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ ఒక రహస్య పోస్ట్‌ను షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీని షేర్ చేస్తూ, "ఔర్ సునావో?? (మరింత చెప్పండి)" అని క్యాప్షన్‌లో రాసింది.

అయితే ఇటీవల గోవాలో జరిగిన శ్రద్ధా పుట్టినరోజు వేడుకల్లో రోహన్ పాల్గొనలేదు. ఈ క్రమంలో వీరిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని తెలిసింది. ప్రస్తుతం శ్రద్దా ఇంకా పేరు ఫైనల్ కాని సినిమాలో రణబీర్ కపూర్‌తో కలిసి నటిస్తోంది. ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తున్నాడు.





Advertisement

Next Story

Most Viewed