హోలీ పండుగ రోజు.. తాగు నీటి కోసం పోరాటం

by samatah |
హోలీ పండుగ రోజు.. తాగు నీటి కోసం పోరాటం
X

దిశ గుమ్మడిదల : ప్రజలంతా రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ జరుపుకుంటుంటే ఇక్కడ బిందెలు పట్టుకుని మహిళలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పండుగ పూట కనీసం తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో గత మూడు రోజులుగా నీళ్లు రావడం లేదు. గ్రామ పంచాయతీ సమీపంలో మిషన్ భగీరథ పైప్ పగిలిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పైప్ లైన్ తిరిగి బాగు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పంచాయతీ పాలకవర్గం సభ్యులకు విన్నవించుకున్న ఫలితం లేదని మండి పడుతున్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు మండల నాయకులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పంచాయితీ కార్యదర్శికి విషయం చెప్పడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రావడంలేదన్నారు. ఈ రోజు టాంకర్లతో అయినా నీరు సరఫరా చేయాలని గ్రామస్తులు పంచాయతీ పాలకవర్గ సభ్యులకు విన్నవించుకుంటున్నారు.

Advertisement

Next Story