- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శంకరయ్య సేఫ్... కిడ్నాపర్ల చెర విడిపించిన పోలీసులు
by Nagaya |
X
దిశ, పెగడపల్లి: జూన్ 22న ముంబాయిలో కిడ్నాప్ అయిన జగిత్యాల జిల్లా వాసి శంకరయ్యను పోలీసులు రక్షించినట్టుగా తెలుస్తోంది. పాండిచ్చేరి ప్రాంతంలో కిడ్నాపర్ల చెరలో ఉన్న శంకరయ్యను సేఫ్‌గా పట్టుకున్న పోలీసులు ముంబాయికి తరలిస్తున్నట్టు సమాచారం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన శంకరయ్య ముంబాయిలో ఫ్లైట్ దిగిన కొద్దిసేపటికే అదృశ్యం అయ్యాడు. మూడు రోజులైనా ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ముంబాయి పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నాపర్ల ఆచూకీ కోసం వేట మొదలుపెట్టారు. కుంభకోణం, తంజావురుతో పాటు పలు ప్రాంతాల్లో గాలించిన పోలీసులు చివరకు పాండిచ్చేరిలో పట్టుకున్నట్టు సమాచారం. కొన్ని గంటల్లో శంకరయ్యతో సహా ముంబాయికి చేరనున్న పోలీసులు ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Advertisement
Next Story