'ShamShera సినిమా నాది' డైరెక్టర్ ఆసక్తికర నోట్..

by Hamsa |   ( Updated:2022-07-28 07:06:05.0  )
ShamShera is Mine, Says Director  Karan Malhotra
X

దిశ, వెబ్‌డెస్క్: ShamShera is Mine, Says Director Karan Malhotra| బాలీవుడ్ జంట రణ్‌వీర్ కపూర్, అలీయాభట్ కలిసి నటించిన చిత్రం 'షంషేరా'. ఈ మూవీకి కరన్ మల్హోత్ర దర్శకత్వం వహించారు. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు, హిందీ తమిళ భాషల్లో జూలై 22న విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోరపరాజయం పొందింది.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ కరణ్ మల్హోత్ర ఇంట్రెస్టింగ్ నోట్‌ను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. '' షంషేరా చిత్రం పట్ల చాలా గర్వంగా, గొప్పగా ఫీలవుతున్నా. సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్, బ్యాడ్ టాక్ ఏది వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నా. షంషేరా నాది'' అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు, మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Balakrishna కు అరుదైన గౌరవం

Advertisement

Next Story