- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధిక లాభాలను సాధించిన సూచీలు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా మదుపర్లు మెరుగైన కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో సూచీలు మెరుగ్గా రాణించాయి. గురువారం ఉదయం నుంచే లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు రొజంతా అదే ధోరణిలో కదలాడాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి కరెన్సీ మారకం విలువ పతనాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఊఇ చర్యలకు ఉపక్రమించడం వంటి పరిణామాలతో పాటు, అమెరికా మార్కెట్ల మద్దతుతో ఆసియా మార్కెట్లు పుంజుకోవడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడింది.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 427.49 పాయింట్లు ఎగసి 54,178 వద్ద, నిఫ్టీ 143.10 పాయింట్లు పెరిగి 16,132 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్ రంగాలు గణానీయంగా పుంజుకోగా, ఎఫ్ఎంసీజీ రంగం మాత్రమే బలహీనపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, టాటా స్టీల్, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించగా, డా రెడ్డీ, నెస్లె ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 79.13 వద్ద ఉంది.