- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుసగా రెండో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను చూశాయి. మంగళవారం ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు చివరి గంట వరకు లాభాల ధోరణిలోనే కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలకు తోడు దేశీయంగా ప్రతికూల అంశాలు లేకపోవడంతో మదుపర్లు కొనుగోళ్లకు మద్దతిచ్చారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలపై ఆశలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. అలాగే, అమెరికా మార్కెట్లలో టెక్ కంపెనీల జోరుతో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. ముడిచమురు ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి తగ్గడం మరింత కలిసొచ్చింది.
దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 350.16 పాయింట్లు ఎగసి 57,943 వద్ద, నిఫ్టీ 103.30 పాయింట్లు పెరిగి 17,325 వద్ద ముగిశాయి. నిఫ్టీలో కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, ఫైనాన్స్ రంగాలు మెరుగ్గా 1 శాతానికి పైగా పుంజుకోగా, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, ఆల్ట్రా సిమెంట్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డా రెడ్డీస్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకి, ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.99 వద్ద ఉంది.