- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూపీఐ నుంచి పబ్లిక్ డెట్ ఇన్వెస్ట్‌మెంట్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచిన సెబీ!
దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు కొంత వెసులుబాటు కల్పించింది. పబ్లిక్ ఇష్యూలలో డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేసే రిటైల్ పెట్టుబడిదారుల కోసం యూపీఐ ద్వారా పెట్టే పెట్టుబడుల పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రస్తుత ఏడాది మే 1 నుంచి లేదా ఆ తేదీ తర్వాత ప్రారంభమయ్యే డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూలకు వర్తిస్తుందని సెబీ తాజా నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూలలో దరఖాస్తు చేసుకునేందుకు యూపీఐ ద్వారా నిధుల పెట్టుబడులకు రూ. 2 లక్షల వరకు అనుమతి ఉంది. అయితే, ఇటీవల జరిగిన చర్చల అనంతరం పెట్టుబడిదారుల అవసరాలు, సౌలభ్యం కోసం దీన్ని పెంచారు. ఒక్కో అప్లికేషన్ విలువ రూ. 5 లక్షల వరకు ఉన్న ఫండ్‌లను ఇన్వెస్టర్లు వినియోగించవచ్చు.