- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈగ బ్రెయిన్‌ను హ్యాక్ చేసిన సైంటిస్ట్స్
దిశ, ఫీచర్స్ : రైస్ యూనివర్సిటీ పరిశోధకులు ఈగల మెదడును రిమోట్ కంట్రోల్‌తో హ్యాక్ చేసి చూపించారు. వాటి మెదడులోని కొన్ని న్యూరాన్స్‌కు ఆదేశం పంపిన సెకనులోపు ఈగలు ఒక నిర్దిష్ట చర్యను నిర్వహించాయి. ఈ పరిశోధన ద్వారా సైంటిస్టుల బృందం మానవాళికి ముఖ్యంగా శారీరక కదలికల్లేని వ్యక్తులకు ఓ పరిష్కారం చూపాలనుకుంటోంది.
పరిశోధకులు మొదట ఈగలను జన్యుపరంగా ఇంజనీరింగ్ చేశారు. అపుడు తమ న్యూరాన్స్‌లోని కొన్నింట నిర్దిష్ట హీట్-సెన్సిటివ్ అయాన్ చానల్‌ను వ్యక్తీకరించాయి. సదరు చానల్ వేడిని గ్రహించినప్పుడు, అది న్యూరాన్‌ను సక్రియం చేస్తుంది. ఈగ రెక్కలను విస్తరించేందుకు ఆ న్యూరాన్ సహకరిస్తుంది. ఇక సంభోగ సమయంలో ఈగలు తరచూ ఉపయోగించే సంజ్ఞ ఇదే కావడం విశేషం. కీటకాల మెదడుల్లోకి హీట్ ట్రిగ్గర్ ఇంజెక్ట్ చేసిన తర్వాత 'ఐరన్ ఆక్సైడ్ నానోపార్టికల్స్' రూపం తటస్థిస్తుంది. ఆపై సమీపంలోని అయస్కాంత క్షేత్రాన్ని ఆన్ చేసినప్పుడు ఆ కణాలు వేడెక్కుతాయి. దీని వలన న్యూరాన్లు కాల్చబడి ఆ ఈగ స్ప్రెడ్-వింగ్ భంగిమను అవలంబిస్తుంది. కాగా ఈగలోని సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఇంజనీరింగ్ ఫ్లైస్‌ను మాగ్నెటిక్ కాయిల్ పైన ఒక చిన్న ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. వాటిని ఓవర్‌హెడ్ కెమెరాలతో వీక్షిస్తూ అయస్కాంత క్షేత్రాన్ని ఆన్ చేసినప్పుడు ఈగలు అర సెకనులోపు రెక్కలు విప్పడాన్ని గుర్తించారు.
మెదడును అధ్యయనం చేసేందుకు లేదా నాడీ సంబంధిత రుగ్మతలకు చికిత్స చేసేందుకు సైంటిఫిక్ కమిటీ చాలా కచ్చితమైన, అతి తక్కువ హాని కలిగించే సాధనాల కోసం శోధిస్తోంది. అయస్కాంత క్షేత్రాలతో ఎంపిక చేసిన న్యూరల్ సర్క్యూట్స్ రిమోట్ కంట్రోల్.. న్యూరోటెక్నాలజీలకు కొంతవరకు ప్రాముఖ్యత కలిగిఉంది. మా పని ఆ లక్ష్యం వైపుగా కీలక అడుగు వేసింది. ఎందుకంటే ఇది రిమోట్ మాగ్నెటిక్ కంట్రోల్ వేగాన్ని పెంచుతుంది, ఇది మెదడు సహజ వేగానికి దగ్గరగా చేస్తుంది.
దృష్టి లోపం ఉన్న రోగులకు కొంత దృష్టిని పునరుద్ధరించేందుకు ఈ రకమైన సాంకేతికతను ఉపయోగించడం బృందం లక్ష్యం. అంతిమంగా ఇది ఒక వ్యక్తి మెదడులోని నాడీ కార్యకలాపాలను చదివి మరొక మెదడుకు రాయగలిగే హెడ్‌సెట్‌ను అభివృద్ధి చేయాలనుకుంటోంది. ఈ పరిశోధన జర్నల్ నేచర్ మెటీరియల్స్‌లో ప్రచురితమైంది.