- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆ వారం అంగడితో ఇబ్బందులు.. అక్కడి నుండి మార్చాలి..'
by Vinod kumar |
X
దిశ, కంది: సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద ప్రతి శుక్రవారం నిర్వహించే సంతను మార్చాలని సంగారెడ్డి మండలం తాళ్లపల్లి సర్పంచ్ ప్రవీణ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ శుక్రవారం అంగడి వల్ల అక్కడ పరిసర కాలనీ వాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని అన్నారు. అలాగే స్కూల్లో, కాలేజీలో నుంచి వచ్చే విద్యార్థులకు కూడా రాను పోను సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఇకపోతే ప్రధానంగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే కనీసం అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. వెంటనే శుక్రవారం అంగడిని అక్కడి నుంచి మార్చి వేరేచోట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట ఉప సర్పంచ్ యాదగిరి రెడ్డి, వార్డు మెంబర్ అనిల్ లు ఉన్నారు.
Advertisement
Next Story